కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ ముందుగా దసరా కానుకగా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ తలైవర్ రజినీకాంత్ నటించిన “వేట్టైయన్” ని కూడా విడుదలకి తీసుకొస్తుండగా సూర్య రజినీకి గౌరవం ఇచ్చి తన సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు.
అయితే ఈ సినిమాని అక్టోబర్ ఎండింగ్ కి తీసుకొస్తారు అన్నట్టు అప్పుడే రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మరో కొత్త రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం నవంబర్ కి మారినట్లు తెలుస్తుంది. దీంతో కొత్త డేట్ గా నవంబర్ 15న తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post మరో కొత్త తేదీలో.. first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
