మరో రెండు సినిమాలు! | CineChitram

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేసిన తాజా సినిమా  ‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేందుకు విశ్వక్ సేన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అయితే, ఈ సినిమా విడుదల తరువాత తన తరువాత సినిమాలను కూడా వరుసగా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్‌ హీరో. ఇప్పటికే లైలా అనే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు విశ్వక్.

ఈ సినిమాతో పాటు ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినపడుతున్నాయి. దర్శకుడు కెవి అనుదీప్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు విశ్వక్ సిద్దమవుతున్నాడు.

ఈ సినిమాతో పాటు ‘భీమ్లా నాయక్’ ఫేం దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లోనూ విశ్వక్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినపడుతుంది. అయితే, ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు మాత్రం ఎదురు చూడాల్సిందే.

The post మరో రెండు సినిమాలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Ram Charan’s interesting comments on Game Changer | CineChitram

The global star Ram Charan has joined forces with the visionary director Shankar for a …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading