మామూలు ప్లానింగ్‌ కాదు బాబోయ్‌! | CineChitram

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమాల ప్లానింగ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాడనే విషయం తెలిసిందే. వందకి వంద శాతం సరైన దర్శకులను సెలెక్ట్‌ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతుంది.

ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉండగానే  పలు సినిమాలకు సంబంధించిన కథలు వింటున్నాడు చెర్రీ. కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. వాటిలో ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తెరకెక్కుతుంది. గేమ్ ఛేంజర్ కంప్లిట్ చేసిన చరణ్ బుచ్చి బాబు సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు.

ఇందుకోసం బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమాతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినెమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాకనే రామ్ చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది..

ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మరోక తమిళ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు చరణ్‌. ఖైదీ, విక్రమ్, లియో వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా రాబోతుంది. ఇప్పటికే కథ చర్చలు పూర్తి అయ్యాయి. బుచ్చి బాబు సినిమా తర్వాత లోకేష్ సినిమా ఉండనుంది.

The post మామూలు ప్లానింగ్‌ కాదు బాబోయ్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …