ముచ్చటగా మూడోసారి! నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చివరి సినిమా “సరిపోదా శనివారం” తో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత నాని హిట్ 3 అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో “ది ప్యారడైజ్” సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి తాజాగానే ప్యారడైజ్ కోసం నాని బీస్ట్ లుక్ లోకి కూడా రెడీ అవుతున్న జిమ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.
ఇక తాజాగా ఈ సినిమా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు ప్రకటించారు. దీంతో నానితో అనిరుద్ జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత ముచ్చటగా ఇది మూడో సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా సబ్జెక్టు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయగా అనిరుద్ దీనికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.
The post ముచ్చటగా మూడోసారి! first appeared on Andhrawatch.com.