తెలుగు ఆడియెన్స్ మంచి క్రేజ్ ఉన్న దక్షిణాది హీరోల్లో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఒకరు. మరి తన డైరెక్షన్ లో వచ్చిన పలు సినిమాలకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా తన దర్శకత్వంలో హీరోగా కూడా చేసిన తాజా సినిమానే “యూఐ”. మరి తన మార్క్ క్రేజీ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ కి దిమ్మ తిరిగేలా చేసిన ఈ సినిమా కన్నడ సహా తెలుగు ఆడియెన్స్ ఆదరణ సంపాదించుకుంది.
అయితే ఈ సినిమాపై పలు రూమర్స్ అయితే ఓటిటికి సంబంధించి వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నారని అందులో త్వరలోనే సినిమా రాబోతుందంటూ పలు రూమర్స్ వచ్చాయి. మరి వీటిపై సినిమా నిర్మాణ సంస్థలు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాయి.
తమ యూఐ సినిమాపై వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ ఓటిటి వార్తలని ఖండించారు. ఏదైనా సరే తమ నుంచే అఫీషియల్ గా క్లారిటీ వస్తుంది అని సో అప్పుడు వరకు ఎదురు చూడాలన్నారు. మరి యూఐ ఓటిటి పార్ట్నర్, విడుదల పై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post “యూఐ” ఓటిటి వార్తలపై అఫీషియల్ క్లారిటీ! first appeared on Andhrawatch.com.