విశాఖలోని కంటైనర్ టెర్మినల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. చైనా నుంచి లిథియం బ్యాటరీలతో వచ్చిన కంటైనర్‌లో మంటలు చెలరేగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దట్టమైన పొగ కమ్మేయడంతో పోర్ట్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గత నెల 28న చైనా నుంచి వచ్చిన కంటైనర్ కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది.
ఇవాళ ట్రాలర్‌పై లోడ్ చేసిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అంతర్గత విచారణ జరుగుతోంది. కంటైనర్‌లలో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రమాదం జరిగిన సమీపంలోనే రజినీ కాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ అగ్నిప్రమాదం తర్వాత వెంటనే చిత్రబృందం అప్రమత్తమైంది. వెంటనే అక్కడి నుంచి తరలివెళ్లినట్లు సమాచారం.అక్కడ 10 రోజులుగా రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో సినిమా బృందం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
The post రజినీకాంత్ కు తప్పిన పెను ప్రమాదం! first appeared on Andhrawatch.com.