రాజా సాబ్‌ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ! | CineChitram

కమర్షియల్ మాస్‌ యంగ్‌ డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌ లో పాన్ ఇండియా రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం. తెలిసిందే.అయితే, నిధి అగర్వాల్‌, ప్రభాస్‌ సరసన ఈ భారీ ప్రాజెక్ట్‌ లో యాక్ట్‌ చేస్తుంది. అయితే, తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రాజాసాబ్‌’లో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘‘హారర్‌ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో నేను దెయ్యం పాత్ర చేయడం లేదు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో నా పాత్ర కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ప్రభాస్ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. సెట్‌లో అందరితో సరదాగా ఉంటారు’’ అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయకులుగా గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్‌పై ఇప్పటికే మూడున్నర గంటల సినిమా నిడివి ఉందని, ప్రస్తుతం ఎడిటింగ్ విభాగం ఆ నిడివి తగ్గించే పనిలో ఉన్నట్లు సమాచారం.

The post రాజా సాబ్‌ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ! first appeared on Andhrawatch.com.

About

Check Also

Hrithik Roshan’s Injury Delays War 2 Song Shoot with Jr NTR | CineChitram

Bollywood diva Hrithik Roshan and Telugu cinema superstar Jr NTR are all set to share …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading