లూసిఫర్ 2 ట్రైలర్‌కి ముహుర్తం కుదిరింది! మళయాళ సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం లూసిఫెర్ సీక్వెల్ ఎంపురాన్ కోసం అందరికీ తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫెర్ కి సీక్వెల్ గా గ్రాండ్ ఎలిమెంట్స్ తో మేకర్స్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు.
మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ట్రైలర్ పై ఇపుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. టీజర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం ఇపుడు ట్రైలర్ తో అలరించేందుకు ఈ మార్చ్ మార్చ్ 20 మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాలకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. మరి పాన్ ఇండియా లెవెల్లో వచ్చే ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.
ప్రస్తుతం మేకర్స్ ప్రతీ పనిని పక్కా ప్లాన్ తో తీసుకెళ్తున్నారు. ఇక రేపు వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి దీపక్ దేవ్ సంగీతం అందిస్తుండగా మార్చ్ 27న గ్రాండ్ గా ఈ చిత్రం రాబోతుంది. అలాగే ఈ తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
The post లూసిఫర్ 2 ట్రైలర్‌కి ముహుర్తం కుదిరింది! first appeared on Andhrawatch.com.