తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ నిర్మాణ సంస్థలతో పాటు , స్టూడియోస్ లో అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఒకరు. మరి ఇలా వారి నుంచి ఇపుడు ఒక షాకింగ్ అనౌన్సమెంట్ అయితే వచ్చింది. తమ పేరిట బయట జరుగునున్న మోసపూరిత ప్రక్రియలపై వారు స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేసేందుకు జాబ్ ఆఫర్స్ అంటూ కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి అని వాటిని ఎవరూ నమ్మొద్దు అంటూ చెబుతున్నారు.
నటీనటులు, టెక్నీషియన్స్ గా తీసుకునేందుకు మా పేరిట కొందరు తప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు అందరూ గుర్తుంచుకొండి అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బులు ఛార్జ్ చేయదు అని క్లారిటీ ఇచ్చారు. ఆడిషన్స్ అయినా ఇంక ఏ సందర్భాల్లో అయినా కూడా తాము డబ్బులు తీసుకోమంటూ తెలిపారు. ఎవరికైనా తప్పుడు సంప్రదింపులు వస్తే తమ మెయిల్ ద్వారా తమని రీచ్ అవ్వొచ్చని చెబుతూ జాగ్రత్తగా ఉండమంటున్నారు.
The post వాటిని నమ్మకండి! first appeared on Andhrawatch.com.