వారిద్దరి కథ అలా ఉంటుందా! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తరువాత సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే సినీ వర్గాలు కన్ఫమ్ చేశాయి.

తాజాగా ఈ సినిమా నేపథ్యం ఏమిటనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో రానుందని.. అందుకే ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో వచ్చిన మగధీర, మనం వంటి సినిమాల కథ మాదిరి ఈ మూవీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాను ఫైనల్ చేశారని.. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నారనే వార్త వినపడుతుంది.

The post వారిద్దరి కథ అలా ఉంటుందా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …