“విజయ్ 12” టైటిల్ పై నాగ వంశీ క్రేజీ న్యూస్! టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇపుడు చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి. విజయ్ కెరీర్లో 12వ సినిమాగా ఇది వస్తుండగా ఎప్పుడు నుంచో విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా టైటిల్ పట్ల గత కొన్నాళ్ల నుంచి మంచి సస్పెన్స్ నెలకొనగా ఫైనల్ గా దీనిపై యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఒకటి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. తన డైరెక్టర్ గౌతమ్ ని ఫుల్ గా హింస పెట్టి ఒక టైటిల్ ని అయితే లాక్ చేశామని తేల్చి చెప్పారు. అలాగే ఈ టైటిల్ ని అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు.
దీంతో ఫైనల్ గా విజయ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ వినపడిందని చెప్పాలి. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
The post “విజయ్ 12” టైటిల్ పై నాగ వంశీ క్రేజీ న్యూస్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
