వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే చిత్ర సీమ నుంచి చాలా సినిమాలు రెడి అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి తెలుగుతో పాటుగా తమిళ్ నుంచి కూడా పలు సినిమాలు పోటీలో ఉండగా..వాటిలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా కూడా ఒకటి.
అయితే ఈ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” తో పోటీ పడనుందని టాక్ వినిపించింది.. మరి మేకర్స్ కూడా డౌట్ గానే చెప్పారు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా అక్కడ వాయిదా పడింది. అయితే ఈ సినిమా రావట్లేదు కానీ దీని కంటే ముందు అనౌన్స్ చేసిన మరో సినిమా ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్న “విడా ముయర్చి” ని ఇపుడు సంక్రాంతి విడుదలకి చిత్ర బృందం లాక్ చేసింది.
ఒక సాలిడ్ టీజర్ కట్ తో ఫైనల్ గా ఇపుడు ఈ సినిమా సంక్రాంతి రేస్ కి ఫిక్స్ అయ్యింది. మరి డేట్ ఏంటి తెలుగు విడుదల పై కూడా ఇంకా ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
The post సంక్రాంతికి అజిత్ మూవీ ఒక్కటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
