నటి సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి ఈరోజు ఎంతో వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.
పూజా కన్నన్ కూడా ఒక సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన చిత్రై సెవ్వనం మూవీతో ఎంట్రీ ఇచ్చిన పూజా కన్నన్ తన అక్క స్థాయికి తగ్గట్టుగా క్రేజ్ రాకపోవడంతో సినిమాల నుంచి బయటకు వచ్చేసింది.
గత కొన్ని నెలల క్రితం పూజా కన్నన్ పెళ్లి ఖరారైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పూజా కన్నన్ వివాహం ఈరోజు కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో జరిగింది. సాయి పల్లవి దగ్గరుండి తన చెల్లెలు పెళ్లిని నిర్వహించింది. పూజా కన్నన్ తన చిరకాల ప్రియుడు వినీత్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంట పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.
The post సాయి పల్లవి చెల్లి పెళ్లి ఫోటోలు…సోషల్ మీడియాలో వైరల్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
