ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి అవైటెడ్ భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబోలో రాబోతున్న మూవీనే అని చెప్పుకోవచ్చు. అయితే రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. మరి ఈ క్రమంలోనే మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసేసుకుని సింహాన్ని బంధించినట్టుగా చేసిన పోస్ట్ ఆ మధ్య మంచి కేజ్రీగా మారింది.
కానీ లేటెస్ట్ గా మహేష్ బాబు పాస్ పోర్ట్ తో కనిపించడం వైరల్ అవుతుంది. దీంతో మహేష్ కి రాజమౌళి నుంచి చిన్న గ్యాప్ దొరికింది అని మళ్ళీ చిన్న ట్రిప్ మహేష్ వేస్తున్నట్టుగా పలు పిక్స్ వైరల్ గా మారాయి. దీనితో మళ్ళీ సోషల్ మీడియాలో అభిమానుల నడుమ మంచి ఫన్ కొనసాగుతుంది. ఇక ఈ భారీ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తుండగా పాన్ వరల్డ్ లెవెల్ అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి.
The post సింహాన్ని వదిలేసిన రాజమౌళి..! first appeared on Andhrawatch.com.