హీరోయిన్‌ కుదిరిందా? | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఎవరూ ఊహించని లుక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ సినిమాను పూర్తి అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్ సెలెక్ట్ అయ్యిందనే వార్త జోరుగా వినిపిస్తోంది. హాలీవుడ్‌లో పలు సెన్సేషనల్ చిత్రాల్లో నటించిన నవోమీ, ఈ సినిమాలో అదిరిపోయే అడ్వెంచర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటిస్తే, ఈ చిత్రం అంతర్జాతీయంగా దూసుకెళ్లడం ఖాయమని చిత్ర బృందం అనుకుంటున్నారంట.

మరి నిజంగా ఈ సినిమాలో నవోమీ స్కాట్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందా లేదా.. అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందించేదుకు సిద్ధమవుతోంది.

The post హీరోయిన్‌ కుదిరిందా? first appeared on Andhrawatch.com.

About

Check Also

 I Feel A Bit Nervous: Alia Bhatt | CineChitram

Renowned Bollywood actress Alia Bhatt, who captivated audiences with her stellar performances and gained popularity …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading