అంచనాలు పెంచేసింది! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రాల్లో ‘ఓదెల 2’ కూడా ఒకటి. దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా లీడ్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తొలి పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఓదెల 2 చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫిబ్రవరి 22న ‘ఓదెల 2’ టీజర్ రిలీజ్ కానుంది. ఇక ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న ‘ఓదెల 2’ చిత్రంపై ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టీజర్ కట్‌ను మేకర్స్ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట.

ఈ సినిమాను పవర్‌ఫుల్ కథతో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

The post అంచనాలు పెంచేసింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

A veteran Bollywood actress for Chiru-Odela’s film? | CineChitram

As we all know, mega star Chiranjeevi is teaming up with the young sensational director …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading