యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ సినిమా “లక్కీ భాస్కర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ కానీ టీజర్లు కానీ ఆడియెన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.
ఇలా ప్రస్తుతానికి మంచి బజ్ లోనే ఉన్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకి సిద్దం అవుతోంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు వినాయక చవితి కానుకగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరిలు తమ బాబుని ఎత్తుకొని కనిపిస్తున్న ఈ పిక్ చూసేందుకు చాలా ముచ్చటగా ఉందని చెప్పాలి.
ఇలా ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ పోస్టర్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ చిత్రం ఈ అక్టోబర్ 31న విడుదలకి రెడీ అయ్యింది.
The post అందమైన కుటుంబ కథా చిత్రం! first appeared on Andhrawatch.com.