బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ ఎప్పుడూ కూడా తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు ఆమె ఎంపీ కూడా. అందుకే, ఈ మధ్య నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను చెబుతుంది. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ తన పెళ్లి పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్.. ‘నటుడు లేదా రాజకీయ నాయకుడు.. వీరిలో మీరు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి గా ఉన్నారు అనే ప్రశ్నకు స్పందించిన కంగనా.. ‘దీని గురించి ఇప్పుడు నేనేం చెప్పగలను ?, అయితే, పెళ్లిపై నాకు సదాభిప్రాయమే ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక్క భాగస్వామే ఉండాలని నేను అనుకుంటాను.
అదే విధంగా పిల్లలు కూడా ఉండాలి. నాకు ఫ్యామిలీ పై ఆ ఆసక్తి ఉంది. కాకపోతే, నాపై ఎంతో నెగటివ్ పబ్లిసిటీ జరిగింది. జరుగుతుంది కూడా. దీంతో నేను ఎంతో అపఖ్యాతిని మూట కట్టుకున్నాను. అందుకే, పెళ్లి చేసుకోలేకపోతున్నా. నాపై ఎన్నో కోర్టు కేసులు ఉన్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక నాకు ఏమైనా సమన్లు వస్తే.. అది చూసి మా అత్తమామలు నన్ను విడిచి పారిపోతే.. అప్పుడు నేనేం చేయాలి ?, ఒకవిధంగా ఇదీ ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదే’ అని కంగనా రనౌత్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చింది.
The post అందుకే పెళ్లి చేసుకోలేకపోతుందంట! first appeared on Andhrawatch.com.