అందుకే పెళ్లి! | CineChitram

అందాల తార అదితీ రావ్‌ హైదరీ మంచి నటి. అలాంటి నటి అవకాశాల్ని అందుకోలేపోయాను అని ఎమోషనల్ అవుతుంది. గతేడాది ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో సినీప్రియుల్ని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఆ సిరీస్ లో అదితీ రావ్‌ హైదరీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పైగా ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన సిరీస్‌ ఇది. అయితే, ఈ సిరీస్ తో ‘అదితీ రావ్‌ హైదరీ’ ఎన్నో ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ.. అవకాశాల్ని మాత్రం అందుకోలేపోయింది.

ఇదే విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘హీరామండీ’లో నా నటనకు, డ్యాన్స్‌కు ఎంతో మంది ఫిదా అయ్యారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాను. కానీ, ఆ సిరీస్ తర్వాత నేను ఆశించిన పాత్రలు, అవకాశాలు నాకు రాలేదు. ఆ సమయంలో మంచి కథల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ ఖాళీ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదితీ రావ్‌ హైదరీ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తోంది.

The post అందుకే పెళ్లి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Producer Naga Vamsi Fires at Some Website Reviewers, Challenges Media: Ban Me and My Films | CineChitram

Producer Naga Vamsi recently delivered a box office success with the latest release ‘Mad Square,’ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading