అందుకే లాభాలు! | CineChitram

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ నోబడి’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కూడా మూవీపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ డిజిటల్ రైట్స్ రూపంలోనే లాభాలను అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘కోర్ట్’ చిత్రాన్ని నాని దాదాపు రూ.6 కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.9 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇలా కేవలం సినిమా డిజిటల్ రైట్స్‌తోనే నాని లాభాలను అందుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

The post అందుకే లాభాలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

క్రేజీ ట్విస్ట్‌! | CineChitram

టాలీవుడ్ అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading