అందులో నిజం లేదు! విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వెంకీ మామ సరసన ఇద్దరు యంగ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరిలు నటించారు. మరి వీరిలో మీనాక్షి చౌదరిపై ఇటీవల పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఆమెని ఏపీ ప్రభుత్వం విమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్ గా నియమించినట్టు పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ అఫీషియల్ సోషల్ మీడియా వారు క్లారిటీ ఇచ్చారు. “ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.” అంటూ వ్యక్తం చేశారు. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని దీనితో తేలిపోయింది.
The post అందులో నిజం లేదు! first appeared on Andhrawatch.com.