అక్కడ బుకింగ్స్‌ మొదలైయ్యాయి! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ డైరెక్టర్‌  శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు సినిమా విడుదల సమయం దగ్గరకి వస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ యూకే లో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ మొదలైయ్యాయి. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఓవర్సీస్ బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్టుగా మేకర్స్ చెప్పారు. మరి యూఎస్ సహా ఇతర దేశాల్లో బుకింగ్స్ ఏ లెవెల్లో ఎలా ఉంటాయో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లో జనవరి 9 నుంచే రానుంది.

The post అక్కడ బుకింగ్స్‌ మొదలైయ్యాయి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …