అక్కినేని పెళ్లికొడుకుతో దగ్గుబాటి హీరో.. | CineChitram

 టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరోస్ లో అక్కినేని వారి నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. మరి చైతూ హీరోగా ఇపుడు భారీ పాన్ ఇండియా సినిమా  “తండేల్” చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా.

ఈ సమయంలో చైతూ తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తాను ప్రముఖ నటి శోభిత ధూళిపాళ వివాహం చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉండగా నిన్ననే ఈ ఇద్దరు నవ దంపతులు వివాహ బంధంతో ఒకటిగా మారారు. అయితే ఈ వేడుకలకి సినీ ప్రముఖులు కూడా కొందరు హాజరు కాగా వీరిలో దగ్గుబాటి హీరో రానా కూడా విచ్చేశాడు.

మరి చైతూతో కలిసి ఓ పిక్ ని కూడా తాను షేర్ చేసుకోగా ఇపుడు ఇది మంచి ఫోటో మూమెంట్ గా మారింది. పెళ్లి కొడుకు అంటూ చైతూతో కలిసి ఈ పిక్ ని తాను షేర్ చేసుకోగా పెళ్లి కొడుకుగా సిద్ధం అయ్యిన నాగ చైతన్యతో రానా తన కొత్త మేకోవర్ లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ పిక్‌ వారి ఫ్యాన్స్ వైరల్‌ చేస్తున్నారు.

The post అక్కినేని పెళ్లికొడుకుతో దగ్గుబాటి హీరో.. first appeared on Andhrawatch.com.

About

Check Also

Aditya Hasan’s Sequel: Anand Deverakonda & Vaishnavi Chaitanya Reunite for the Big Screen | CineChitram

Sithara Entertainments, known for its impressive portfolio of successful films like Lucky Bhaskar and Daaku …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading