నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ సినిమా “డాకు మహారాజ్” పట్ల ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిన విషయమే.మరి ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2” కూడా రానున్న సంగతి తెలిసిందే
అయితే ఈ సినిమా షూటింగ్ తాజా గానే మొదలు కాగా దర్శకుడు బోయపాటి శ్రీను మరో లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇక ఇదిలా ఉండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు ఈ సినిమాపై వినిపిస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కూతురు కీలక పాత్రలో కనిపించబోతుందని సమాచారం. అఖండ పార్ట్ 1 లో బాలయ్యతో ట్రావెల్ అయ్యే చిన్నారి పాత్ర అందరికీ గుర్తుంది కదా. మరి ఆ పాప పెద్దయ్యాక కనిపించే పాత్రలో ఆలనాటి సీనియర్ నటి లయ కూతురు నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇదే ఆమెకి మొదటి సినిమా అన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post అఖండ 2లో సీనియర్ నటి కూతురు! first appeared on Andhrawatch.com.