‘అఖండ 2’లో సీనియర్ హీరోయిన్ శోభన ? | CineChitram

నటసింహం బాలయ్య బాబు – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది.

ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె పాత్ర ఓ సన్యాసిని అని తెలుస్తోంది. సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు కీలక పాత్రల్లో నటించేందుకు ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ సిద్ధమయ్యారు.

థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి.

The post ‘అఖండ 2’లో సీనియర్ హీరోయిన్ శోభన ? first appeared on Andhrawatch.com.

About

Check Also

Kichcha Sudeep Bids Farewell to Bigg Boss Kannada! | CineChitram

Bengaluru: Renowned actor Kichcha Sudeep has announced that he will step down as the host …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading