ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట డైరెక్టర్. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
‘1992 స్కామ్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్ గాంధీ. ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. దీంతో ప్రతీక్ గాంధీ అయితే తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉంటుందని మేకర్స్ అనుకుంటున్నారంట. మరి ఈ సినిమాలో నిజంగా ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడా.. అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
The post అఖిల్ కోసం బాలీవుడ్ విలన్! first appeared on Andhrawatch.com.