అతిథి పాత్రలో..! నందమూరి నటసింహం బాలయ్య – డైరెక్టర్ బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని కూడా అనుకున్నారు.
అయితే ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను పెట్టలేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని వినపడుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఓ యాక్షన్ సీక్వెన్స్ నడుస్తోందని టాక్ వినపడుతుంది.
మరి బాలయ్య సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
The post అతిథి పాత్రలో..! first appeared on Andhrawatch.com.