తాజాగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్అందుకున్న సినిమాల్లో
దర్శకుడు పెరియసామి టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ కాంబో లో వచ్చిన ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ సినిమా “అమరన్” కూడా ఒకటి. సాయి పల్లవి సాలిడ్ పెర్ఫామెన్స్ అందించిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ పలు రకాల షేడ్స్ ని అందించిన సంగతి తెలిసిందే. అలా యంగ్ ముకుందన్ గెటప్ లో తన భార్యకి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఇంట్లోనే పని చేసుకుంటున్న తన భార్య ఆర్తి వెనుక నించుని సర్ప్రైజ్ అందించాడు. దీనితో ఈ వీడియో ఎంతో క్యూట్ గా ఉంది అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఈ క్యూట్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The post అమరన్ గెటప్ లో భార్యతో..! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
