అర్జున్‌ అందుకే రాలేదు! | CineChitram

అర్జున్‌ అందుకే రాలేదు! అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన మూవీ ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి డైరెక్షన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మూవీటీమ్‌ ఎంతో గ్రాండ్‌ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. శనివారమే జరగాల్సిన ఈ ఈవెంట్ అనివార్య కారణాలతో ఆదివారం జరిగింది.

కాగా ఈ సినిమా జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తాడని మొదట టీమ్ అధికారికంగా తెలిపింది. దీంతో, బన్నీ అభిమానులు కూడా తండేల్ ఈవెంట్ పై బాగా ఆసక్తి చూపించారు. కానీ, చివరి నిమిషంలో తండేల్ జాతర ఈవెంట్ కి బన్నీ రాలేకపోయాడు. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.

అరవింద్ మాట్లాడుతూ.. ‘తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ అతిథిగా రావాల్సి ఉంది. కానీ, తను విదేశాల నుంచి వచ్చాడు. తనకు చాలా గ్యాస్ పెయిన్‌ వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ కి బన్నీ రాలేకపోయాడు. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి’ అని అల్లు అరవింద్ వివరించారు.

The post అర్జున్‌ అందుకే రాలేదు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Rana Naidu Season 2 Teaser Released | CineChitram

Victory Venkatesh went bold in the digital space with Rana Naidu, an engaging crime and …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading