వయసుకు వచ్చిన ప్రతి అమ్మాయి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలని కలలు కంటుందనే విషయం తెలిసిందే. భర్త విషయంలో ఏ అమ్మాయికైనా కొన్ని కోరికలు ఉంటాయి. చేసుకునే వాడి లో ఆ క్వాలిటీలు..ఈ క్వాలిటీలు ఉండాలని సన్నిహితుల దగ్గర చెబుతుంటారు. ఈ విషయంలో ఎవరైనా ఒక్కటే.. సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు తమ భర్తలో ఫలానా క్వాలిటీలు ఉండాలని కోరుకుంటున్నట్లు ఇప్పటికే చాలా మంది తమ మనసులోని మాటలు బయటపెట్టారు కూడా.
తాజాగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా తను చేసుకోబోయే భర్త విషయంలో తొలిసారి నోరు విప్పింది. `అతడు ఆదర్శంగా ఉండాలి. నన్ను ఎప్పుడూ జోక్స్ వేసి నవ్వించాలి. చాలా క్రియేటివ్ గా ఉండాలి. అలాగే ఇతరుల్లో స్పూర్తిని సైతం నింపేలా ఉండాలి. అలాంటి వాడంటేనే నాకు ఇష్టం` అని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
The post అలాంటి వాడే కావాలంటున్న బ్యూటీ! first appeared on Andhrawatch.com.