అల్లు అర్జున్‌ పక్కా ప్లానింగ్‌ ..ఇందుకోసమేనా! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు బన్నీ సిద్ధమవుతున్నాడు.

అయితే, ‘పుష్ప-2’ సినిమా కోసం అల్లు అర్జున్ పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నాడు. తొలిభాగం చిత్రాన్ని ఉత్తరాదిన ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు. అయితే, ఆ చిత్రానికి నార్త్‌లో భారీ గానే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈసారి ‘పుష్ప-2’ చిత్రాన్ని నార్త్‌లో సాలిడ్‌గా ప్రమోట్ చేసేందుకు బన్నీ సిద్ధం అవుతున్నాడు.

ఇక మేకర్స్ కూడా ‘పుష్ప-2’ నార్త్ ప్రమోషన్స్‌కి కావాల్సినంత బడ్జెట్‌ని కూడా కేటాయించేందుకు రెడీ గా ఉన్నారు.  దీంతో నార్త్‌లో ‘పుష్ప-2’ మూవీపై కూడా భారీ హైప్ క్రియేట్ చేయవచ్చని చిత్ర యూనిట్ అనుకుంటుంది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్‌ రెడీ అవుతుంది.

The post అల్లు అర్జున్‌ పక్కా ప్లానింగ్‌ ..ఇందుకోసమేనా! first appeared on Andhrawatch.com.

About

Check Also

ఆ నగరాన్ని నిర్మిస్తున్నారా! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading