అసలు విషయం ఏంటంటే! ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా గురించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల అధికారికంగా స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. అయితే, తాజాగా ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రీ రవిశంకర్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో వస్తుందని.. ఇలాంటి సినిమా కథను ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌పై ప్రొడ్యూస్ చేయబోతున్నామని.. అలాగే ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌పై మరోసారి అభిమానుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
The post అసలు విషయం ఏంటంటే! first appeared on Andhrawatch.com.