“ఆదిత్య 369” సీక్వెల్లో బాలయ్య లుక్ ఇలా ఉంటుందంటడోయ్‌! | CineChitram

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు సాలిడ్ లైనప్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లో ఉన్నారనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే.  అయితే బాలయ్య చేసిన ఇన్నేళ్ల సినిమాల్లో పలు సినిమాలు అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి అలాంటి క్రేజీ కాన్సెప్ట్ సినిమాల్లో అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో భారీ విజువల్స్ తో వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ “ఆదిత్య 369” అంటే తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు.

లెజెండరీ డైరెక్టర్లు సింగీతం శ్రీనివాసరావు తీర్చిదిద్దన ఈ సినిమాకి  బాలయ్య సీక్వెల్ “ఆదిత్య 999” ఉంది అని ఎప్పుడు నుంచో టాక్‌ వినపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే దీనిని తన వారసుడు మోక్షజ్ఙతో చేస్తానని అది కూడా తన కథ డైరెక్షన్‌ లోనే సినిమా ఉంటుంది అని బాలయ్య బాబూ అయితే ఓ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇది కాకుండా బాలయ్య నుంచి ఈ అవైటెడ్ సీక్వెల్ పై క్రేజీ లీక్ ఒకటి బయటకి విడుదల చేశారు. ఈ చిత్రంలో తన లుక్ ఎలా ఉండబోతుందో తదుపరి ఎపిసోడ్ లో అలా రెడీ అయ్యి చూపించారు. మరి ఇందులో బాలయ్య ఫుల్ ఓల్డేజ్ లుక్ లో ఒక వ్యోమగామిలా కనిపిస్తున్నారు. దీంతో బాలయ్య మాత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం వస్తున్నారనే  చెప్పాలి. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 6 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కి వస్తుంది

The post “ఆదిత్య 369” సీక్వెల్లో బాలయ్య లుక్ ఇలా ఉంటుందంటడోయ్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Jatadhara Caught in Legal Battle Over Financial Dispute | CineChitram

Tollywood’s much-awaited pan-India film Jatadhara has run into a huge snag. Venkat Kalyan directs the …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading