ఆయనకే పూర్తి క్రెడిట్‌ దక్కుతుంది! | CineChitram

టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన తాజా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. ఈ సినిమాలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించారు.

దీంతో వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో హ్యట్రిక్ విజయం రికార్డు అయ్యింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ను చిత్ర యూనిట్  నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర నిర్మాత శిరీష్ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఈ సంక్రాంతికి మేము చాలా కష్టపడ్డాం. అయితే, అనిల్ రావిపూడి లేకపోతే మేము ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్లము కాదు.

మా కష్టాలు ఈ సంక్రాంతితో తీరిపోతాయని అనిల్ ధీమా ఇచ్చాడు.. అన్నట్లుగా ఈ సినిమాతో మేము సంతోషంగా ఉన్నాం. అనిల్ రావిపూడికి ఈ చిత్ర సక్సెస్ క్రెడిట్ పూర్తిగా దక్కుతుంది’ అని శిరీష్ చెప్పుకొచ్చారు.

The post ఆయనకే పూర్తి క్రెడిట్‌ దక్కుతుంది! first appeared on Andhrawatch.com.

About

Check Also

‘Aggipulle’ from Dilruba – A Captivating Melody That Touches the Soul | CineChitram

After the success of KA, Kiran Abbavaram is ready to win over the hearts of …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading