ఆరోగ్యం బాలేకపోయినా సరే..! | CineChitram

టాలీవుడ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తాజా సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న “కిష్కింధపూరి” కూడా ఒకటి. దర్శకుడు కౌశిక్ పగళ్ళపూడి ఈ చిత్రాన్ని థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిస్తుండగా, ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. సాయి శ్రీను సరసన హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండటం ఇప్పటికే హైలైట్‌గా మారింది.

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి కూడా అనుపమ హాజరైంది. అయితే ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం జ్వరంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని బయటపెట్టింది. ఆరోగ్యం బాగోలేకపోయినా, సినిమా ప్రమోషన్ కోసం తాను తప్పక రావాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తన చిత్రంపై ఇంత డెడికేషన్ చూపించడం ఆమె అభిమానుల్లో మంచి చర్చనీయాంశంగా మారింది.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …