స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఎన్నో ఐకానిక్ చిత్రాల్లో తనని ఐకాన్ స్టార్ గా మార్చిన దర్శకుడు సుకుమార్ తో చేసిన చిత్రం “ఆర్య 2” కూడా ఒకటి. తమ కెరీర్లో మొదట వచ్చిన ఆర్య కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద సెన్సేషన్ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు వస్తున్న అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా థియేటర్స్ లో ఆర్య 2 రీరిలీజ్ అయ్యింది.
ఇలా పలు సింగిల్ స్క్రీన్స్ లో బన్నీ అభిమానులు ఈ రిలీజ్ కి సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. మరి ఈ సినిమా లాస్ట్ లో ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ని సెట్ చేయడం థియేటర్స్ లో అభిమానులని ఎంతో ఎమోషనల్ గా ఎగ్జైట్ చేసింది. అల్లు అర్జున్ కంబ్యాక్ పై డిజైన్ చేసిన ఈ సాలిడ్ వీడియో కట్ చూసిన అభిమానులు మంచి హై ని ఫీలవుతున్నారు. ఇక ఈ ఏప్రిల్ పుట్టినరోజు ఈ ఏప్రిల్ 8న రాబోతుండగా ఆరోజు బిగ్ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
The post ఆర్య 2 థియేటర్స్ లో సర్ప్రైజ్! first appeared on Andhrawatch.com.