టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా గ్లోబల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా కథ కాశీ నగరంలో మొదలవుతుందని.. అటుపై అడవులకు ఈ కథ షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో కాశీలో జరగబోయే సీన్స్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో కాశీ నగరం సెట్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా.. అసలు కాశీ నగరానికి ఈ కథలో ఎలాంటి సంబంధం ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
The post ఆ నగరాన్ని నిర్మిస్తున్నారా! first appeared on Andhrawatch.com.