నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో చేసిన అన్ని సినిమాలు సెన్సేషనల్ హిట్ అందుకున్నాయి. అలా వచ్చిన అఖండ అయితే అన్నిటినీ మించి రికార్డులను సెట్ చేసింది. ఇక ఇపుడు పార్ట్ 2శరవేగంగా జరుగుతోంది. అయితే దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ అలా తిరిగేస్తున్నాయి.
బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు అని ….దీంతో షూటింగ్ అంత బాగా జరగట్లేదు అంటూ టాక్ వినపడుతుంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మొత్తం షూట్ అనుకున్నట్టే వెళుతుంది. సో ఆ మాటల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
The post ఆ రూమర్స్ లో నిజం లేదు! first appeared on Andhrawatch.com.