పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇంకా విడుదలకి నోచుకోలేదు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే మొన్న మార్చ్ 28కే థియేటర్స్ లో ఈ చిత్రం ఉండాల్సింది కానీ ఇంకా పవన్ డేట్స్ రాకపోవడంతో సినిమా వాయిదా పడింది.
ఇక ఈ సినిమా రీసెంట్ గానే బ్యాలన్స్ షూట్ ని మళ్ళీ స్టార్ట్ చేసుకోగా పవన్ కళ్యాణ్
కూడా త్వరలోనే జాయిన్ అవుతారు అని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ రూమర్స్ లో నిజం లేదని తెలుస్తుంది. పవన్ ఇప్పట్లో షూట్ కి వెళ్ళేది లేదట. పలు పర్శనల్ కారణాలు మూలాన అందుబాటులో ఉండరు అని తెలుస్తుంది. దీనితో కొన్ని రోజులు వరకు తాను సెట్స్ లో అడుగు పెట్టబోయేది లేదట. ఇక దీనితో మళ్ళీ ఈ సినిమాపై అనుమానాలు పెరుగుతున్నాయి.
The post ఆ రూమార్స్ లో నిజం లేదు! first appeared on Andhrawatch.com.