ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను అయితే షేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. ఎలాగూ దసరా సెలవులు కూడా వచ్చాయి. కాబట్టి, దేవరకి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవర టీమ్ ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.
కాగా ‘దేవర’ సినిమాలో అండర్ వాటర్ సీన్ల కోసం డ్రై ఫర్ వెట్ టెక్నిక్ వాడినట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సాంకేతిక గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘ఈ డ్రై ఫర్ వెట్ టెక్నిక్ సాంకేతికను హాలీవుడ్ చిత్రం అక్వామ్యాన్‌లో ఉపయోగించారు. మనం వాటర్‌లో లేకపోయినా ఉన్నట్లుగా సీజీ వర్క్ ఉపయోగించి అలా చూపించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇక ‘దేవర 2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరో రెండు నెలలు తర్వాత మొదలు కాబోతుందని చెప్పుకొచ్చారు.
The post ఆ సినిమా టెక్నిక్కే..! first appeared on Andhrawatch.com.