ఆ సినిమా నుంచి మరో అప్డేట్! యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్‌ను రివీల్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌గా ‘మొదటి చినుకు’ పాటను మార్చి 20న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ కొత్త పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాలో ఈ పాట మెలోడీగా సాగడంతో పాటు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో ప్రదీప్ మాచిరాజు సరసన దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను నితిన్, భరత్ ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు. రాధాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
The post ఆ సినిమా నుంచి మరో అప్డేట్! first appeared on Andhrawatch.com.