ఆ సీన్‌ అదిరింది అంతే! | CineChitram

తెలుగు సినిమా దగ్గర మంచి అంచనాలు మధ్య తాజాగా విడుదల కి వచ్చిన ఈ దీపావళి సినిమాల్లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ “లక్కీ భాస్కర్” . మరి మంచి బజ్ ని సంతరించుకొని వచ్చిన ఈ సినిమా సాలిడ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి బుకింగ్స్ తో దూసుకెళ్తుంది.

అయితే ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరికి తన విజన్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా సినిమాలో తాను డిజైన్ చేసిన ఓ పర్టిక్యులర్ సీన్ ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. కాగా ఈ సినిమా సెకండాఫ్ లో దుల్కర్ సల్మాన్ తన ఫ్యామిలీతో షాపింగ్ చేసే ఒక మాస్ ఎపిసోడ్ వేరే లెవెల్లో అనిపిస్తుంది.

దీంతో ఈ సినిమా చూసిన చాలా మంది సినిమాలో  ఈ ఒక్క ఎపిసోడ్ కి మాత్రం చాలా కనెక్ట్ అయ్యిపోయారు. సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ సీన్స్ లో ఇది ఒకటి అని ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ్ ఆడియెన్స్ కూడా ఎంతో ప్రశంసలు అందిస్తున్నారు. దీంతో ఈ సీన్ గురించి ఇపుడు నెటిజన్స్ లో చర్చ మొదలైంది.

The post ఆ సీన్‌ అదిరింది అంతే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Nithiin Confident Robinhood Will Be a Blockbuster | CineChitram

Tollywood’s young sensation Nithiin is all set to release his highly anticipated film Robinhood, which …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading