ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ పై రోజుకొక రూమర్ వినపడుతుంది. ఈ సినిమా షూట్ ఈ నెల 22 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అయితే, తాజాగా ఈ షెడ్యూల్ గురించి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారని సమాచారం. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అంటూ ఓ ప్రచారం నడుస్తుంది.
అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నీల్ చాలా సమయాన్నే తీసుకుంటున్నాడు.కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఈ సినిమాని తీయనున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ మూవీ చేస్తున్నాను అని వివరించాడు.
మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది.
The post ఆ సీన్ తో మొదలు పెడుతున్న ఎన్టీఆర్! first appeared on Andhrawatch.com.