ఇంత కథ ఉందా? | CineChitram

ఇంత కథ ఉందా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సంచలన హిట్ చిత్రమే పుష్ప 2 ది రూల్. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రికార్డు వసూళ్లు అందుకొని అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్స్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ అండ్ పాటలు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఈ సినిమా విడుదలకి ముందు నుంచి కూడా ఎంతో హైప్ ఇస్తూ వచ్చిన ఎపిసోడ్ జాతర ఎపిసోడ్.

అయితే ఈ ఎపిసోడ్ కి గంగో రేణుకమ్మ తల్లి సాంగ్ బాగా హైలైట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ వెనుక అసలు కథని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు మొదట మేకర్స్ ఈ సీక్వెన్స్ లో కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉండేలా ఒక పవర్ఫుల్ బిట్ ని ప్లాన్ చేసినట్టుగా తెలిపారు. సుకుమార్ మొదట సీన్ చూపిస్తే దీనికి ఇది సరిపోదు అని వెంట వెంటనే మొత్తం పాట ని తాను చంద్రబోస్ కంపోజ్ చేసేసి సుకుమార్ కి ఇచ్చినట్లు వివరించారు.

దీంతో సుకుమార్ కూడా ఒకింత షాకయ్యి ఆ ఫుల్ సాంగ్ విన్నాక బాగా నచ్చిందని చెప్పారు. అలా సినిమాలో సాలిడ్ ఎమోషన్స్ తో ఈ సాంగ్ వచ్చినట్టుగా దేవిశ్రీ ప్రసాద్ అసలు విషయం రివీల్ చేసాడు. ఇక సినిమాలో ఈ సాంగ్ ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

The post ఇంత కథ ఉందా? first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishnu Manchu’s Kannappa Third Single to Release on Mohan Babu’s Birthday | CineChitram

The makers of Vishnu Manchu’s much-anticipated project Kannappa have announced an exciting update. The third …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading