తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘తండేల్’ వరల్డ్‌వైడ్ విడుదలకు సిద్దమయ్యింది. ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ విడుదలకు ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది.
విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర బృందం.ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ‘తండేల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ ట్రైలర్‌తో అంచనాలను రెట్టింపు చేశారు.
నాగచైతన్య, సాయి పల్లవి పాత్రల మధ్య లవ్ స్టోరీ కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా ‘తండేల్’ చిత్రంలో చూపెట్టనున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పీరియాడిక్ మూవీ గా రానున్న ఈ మూవీలో భారత్-పాకిస్థాన్ వైరానికి సంబంధించి కూడా కొన్ని సన్నివేశాలు కూడా మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. డైలాగులు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో అభిమానులకు ఈ ట్రైలర్ బాగా కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది.
అంతేగాక, యాక్షన్‌కు ఎలాంటి కొదువలేకుండా దర్శకుడు చందు మొండేటి తీసుకున్న జాగ్రత్తలు మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చెప్పేసింది.
The post ఇక రాజులమ్మ జాతరే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
