నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 109వ చిత్రంలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.
అయితే, ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో బాలయ్య నెక్స్ట్ మూవీపై తెగ చర్చ జరుగుతోంది. బాలయ్య తన నెక్స్ట్ సినిమాలో సూపర్‌హీరోగా కనిపించబోతున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ దసరా కానుకగా రానుందని వార్తలు వినపడుతున్నాయి.
దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అసలు బాలయ్య కామన్ హీరోగా చేస్తేనే బాక్సాఫీస్ భరతం పడతాడు.. ఇక సూపర్‌హీరోగా అంటే.. ఆ ఊహ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బాలయ్య నెక్స్ట్ మూవీపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వస్తే అభిమానులకు ఇదే అసలైన పండగ అని మూవీ మేకర్స్ అంటున్నారు.
The post ఇది కదా అసలైన పండగ అంటే! first appeared on Andhrawatch.com.