జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలే గడుస్తున్నప్పటికీ ఆయనని ప్రపంచానికి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పరిచయం చేసింది. ఆ సినిమాతో ఎన్టీఆర్ అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేసత్ఊ తన రాబోయే సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్‌ని కొనసాగించాలని చాలా ఆసక్తిగా చూపిస్తున్నాడు.
ఆర్‌ఆర్‌ఆర్ తరువాత దేవర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు ఎన్టీఆర్ రెడీ గా ఉన్నాడు. ఇక సెప్టెంబర్ 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకుడు కాగా, జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తుంది. తాజాగా ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన స్టార్ క్యాస్ట్ తో పాటు కౄ కూడా హాజరుకానున్నారు. ట్రైలర్ లాంచ్‌కు ముందే ఎన్టీఆర్ ముంబైకి వెళ్లిపోయాడు.
పక్కాగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు అన్ని ప్రఖ్యాత మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ మరో రెండు రోజులు ముంబైలోనే ఉండి ప్రమోషన్స్ ని గట్టిగానే ప్లాన్ చేశారు. ఇప్పటికే కపిల్ శర్మ షో కోసం షూటింగ్ పూర్తి చేసుకోగా… ఈ ఉదయం కరణ్ జోహార్, అలియా భట్ తో ఒక ఇంటర్వ్యూ అయింది. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ కోసం కూడా షూట్ చేశాడని టాక్ వినిపిస్తుంది.
The post ఇది కదా కావాల్సింది..దేవరా! first appeared on Andhrawatch.com.