కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబో లో ఎంతో కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా గేమ్ ఛేంజర్. వినాయక చవితి సందర్భంగా అయినా, ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందో ఏమో అని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ, శంకర్ టీం కొత్త పోస్టర్ తోనే అభిమానుల కంటి తుడుపు తుడిచింది.
దీంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన మూడేళ్ల తర్వాత కూడా సాలిడ్ అప్ డేట్స్ రావడం లేదు అంటూ ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ‘గేమ్ ఛేంజర్’ టీమ్, చరణ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ అప్ డేట్స్ ప్లాన్ చేస్తోందేమో చూడాల్సిందే.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా యాక్ట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
The post ఇవి చాలవు..ఇంకా కొంచెం కావాలి! first appeared on Andhrawatch.com.