గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి.
ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఐతే, జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ కోసం నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని AA ఫిల్మ్స్ దక్కించుకుంది.
కాగా AA ఫిల్మ్స్ ‘పుష్ప 2’ థియేటర్ రైట్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ని కూడా తీసుకోవడం విశేషం. నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర మరియు సముద్రఖని వంటి తారాగణం నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
The post ఈ క్లారిటీ చాలు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
