పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఎడి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ‘కల్కి సీక్వెల్’ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ‘కల్కి సీక్వెల్ టైటిల్’కి సంబంధించి ఓ క్రేజీ గాసిప్ వినపడుతోంది. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారని ఈ రూమార్ల సారాంశం. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట.
ఎలాగూ కల్కి మొదటి భాగాన్ని కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కూడా కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. అందుకే, ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు సమాచారం. పైగా కల్కి సీక్వెల్ లో కర్ణుడు, అశ్వద్ధామల మధ్య చాలా సన్నివేశాలు ఉంటాయని.. ముఖ్యంగా మహాభారత ఘట్టానికి సంబంధించి ‘కల్కి సీక్వెల్’ లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి.
మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో.. ఇప్పటివరకు అయితే ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రటకన అయితే రాలేదు. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నుంచి ‘కల్కి సీక్వెల్’ షూటింగ్ ను మొదలు పెట్టాలని నాగ అశ్విన్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
The post ఈ గాసిప్ విన్నారా? first appeared on Andhrawatch.com.